క్రిస్మన్ పండుగని పురస్కరించుకుని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ రాష్ట్ర ప్రజలతో పాటు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు శనివారం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు ప్రంపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు, గొప్ప శాంతి దూత అని పేర్కొన్నారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం కరుణామయుని ఆశీస్సులని ఆకాంక్షించారు. క్రైస్తవ సోదర సోదరీమణులు అందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా, ఆనందోత్సాహల మధ్య జరుపుకోవాలని కోరారు.