ఏపీఎండిసి సంస్థ మంగంపేట బ్రాంచ్ నందు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ట్రైనీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఫిబ్రవరి నాల్గోతేదీ నుండి 12(3) అగ్రిమెంట్ ప్రకారం 535 మంది కార్మికులకు ఇచ్చి న్యాయం చేయాలని పోరాట కమిటీ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో పెద్ద ఎత్తున కార్మికులు నినాదాలతో నిరసన కార్యక్రమాలు తెలిపారు. ఈ నిరసనలు శనివారం 33 రోజులకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్ ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ గతంలో మూడు రోజులు సమ్మె చేసి సాధించుకున్న సమాన పనికి సమాన వేతనం నందు కేవలం 60 మందికి మాత్రమే సమాన పనికి సమాన వేతనం నందు వారు పని చేస్తున్న పనిని బట్టి వారికి హోదా కల్పించి జీతం ఇచ్చారని మిగిలిన 535 మంది కార్మికులకు వారు పని చేస్తున్న పనిని బట్టి హోదా ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ లు అరుణావతి, ట్రెజరర్ ఈశ్వరయ్య, కమిటీ నాయకులు పాల్గొన్నారు.