అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత గత 8 నెలల్లో జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసారని, జిల్లా అధికారులందరూ అన్నమయ్య జిల్లా అభివృద్ధికి చురుగ్గా కృషి చేయాలని ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో శుక్రవారం అన్నారు.
ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి అన్నమయ్య జిల్లా పర్యటన సందర్భంగా, జిల్లా కేంద్రమైన రాయచోటిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, ఎస్పి హర్షవర్ధన్ రాజు లతో కలసి సందర్శించారు. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశానికి ముందు ధనుంజయరెడ్డి జిల్లా అతిథి గృహం పనులు, ఎస్పీ కార్యాలయం, పరేడ్ గ్రౌండ్స్, ప్రభుత్వ భవనాల కోసం కేటాయించిన స్థలాలను సందర్శించారు.