దొండకాయ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దొండకాయను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దొండకాయను తింటే కండరాలు దృఢంగా తయారవుతాయని ఓ అధ్యయనంలో తేలింది. అంతే కాకుండా అధిక రక్తపోటుతో బాధపడే వారికి గొండకాయ ఉత్తమ ఔషధమని నిపుణులు సూచిస్తున్నారు.