మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవం. కిడ్నీలు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి. కిడ్నీలును ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకం కావచ్చు. మనం తీసుకునే ఆహారం, నీళ్లతో కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రెడ్ క్యాప్సికమ్ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో విటమిన్ ఎ, సి, బి6, ఫోలిక్ యాసిడ్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.