కళ్లు ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా సక్రమంగా చేయగలం. కానీ, ఈ డిజిటల్ యుగంలో గంటల తరబడి కంప్యూటర్/మొబైల్ చూడడం వల్ల కంటి సమస్యలు పెరిగిపోయాయి. మన కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడం మరియు కంటి సమస్యలను నివారించడం చాలా ముఖ్యం. అలాగే ఆహారంలో విటమిన్ ఎ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇందులో ఉండే రెటినోల్, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యారెట్ మరియు ఆకుకూరల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. మెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్, ట్యూనా, సార్డినెస్, ట్రౌట్ మరియు మాకేరెల్ వంటి చేపలను ఎక్కువగా తినండి. వాల్ నట్స్, బాదం, అరటిపండ్లు, ఎండుద్రాక్షలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.