సపోటాలో గ్లూకోజ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. సపోటాలో ఉండే విటమిన్-ఏ వృద్ధాప్యంలో కూడా కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. సపోటా తింటే వాపులు, నొప్పులు తగ్గుతాయి. సపోటాలోని యాంటీ ఆక్సిడెంట్‌లు, పీచు, పోషకాల కాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. నిద్రలేమి సమస్యకు కూడా సపోటా చెక్ పెడుతుంది. సపోటా పండ్లు చర్మం కాంతివంతంగా మారడానికి సహాయపడతాయి. సపోటా పండ్లు తినడం చర్మానికి మంచిది. సపోటా విత్తనాలను ఆముదంతో కలిపి పేస్ట్ చేసుకుని తలకు రాసి, మరుసటి రోజు తల స్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య పోతుందని నిపుణులు చెబుతున్నారు.