రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి ఆదిమూలపు థెరీసమ్మ (85) సోమవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా హైదరాబాద్లోని ఒక ప్రయివేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె తెల్లవారుజామున 1:30 నిముషాలకు (తెల్లవారితే సోమవారం) తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు వైయస్ఆర్సీపీ నేతలు సంతాపం తెలిపారు. థెరీసమ్మకు 5 మంది సంతానం కాగా వారిలో ఇద్దరు కుమారులైన డాక్టర్ ఆదిమూలపు సురేష్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. రెండో కుమారుడు డాక్టర్ సతీష్ జార్జి విద్యాసంస్థల కార్యదర్శిగా ఉన్నారు.