వంగవీటి మోహనరంగా ఆశయాలను కొనసాగించేందుకు చివరి రక్తపుబొట్టు వరకు ధారపోస్తామని, రంగా చూపిన దారిలోనే పార్టీలకు అతీతంగా ముందుకెళ్తామని.. అభిమానుల్లో ఒకడిగా ఆయన అడుగు జాడల్లో నడుస్తానని మాజీ మంత్రి, గుడివాడ వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా రంగా చిత్రపటానికి కొడాలి నాని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రంగాను హత్య చేసిన పార్టీలు, నేతలు రంగా చిత్రపటానికి పూలు వేసి బూట్లు నాకాల్సిన పరిస్థితి వచ్చింది. రంగాను రాజకీయంగా ఎదుర్కోలేక ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ హత్య చేయించిందని, రంగాను హత్య చేసింది వ్యక్తి కాదు.. వ్యవస్థ అని కొడాలి నాని అన్నారు. వంగవీటి రాధా తమ కుటుంబ సభ్యుడని చెప్పారు. రాధాతో తన ప్రయాణం పార్టీలకు అతీతమని చెప్పారు.