కోవిడ్ పరంగా వచ్చే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రుల సన్నద్దతను తనిఖీ చేయాలని, జనవరి 5వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న సీఎం. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో సౌకర్యాలపైనా తనిఖీలు చేపట్టాలని సూచించారు. మాస్కులు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కెపాసిటీపై మరోసారి సమీక్షించుకోవాలన్నారు.