భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ ఫిషింగ్ బోటును సీజ్ చేసినట్టు ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. అరేబియా సముద్ర తీరంలో భారత ప్రాదేశిక జలాల్లోకి పది మంది వ్యక్తులతో ప్రవేశించిన పాకిస్థాన్ ఫిషింగ్ బోటును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఫిషింగ్ బోటులో సుమారు రూ.300 కోట్ల విలువ చేసే ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పాటు 40 కిలోల మత్తుపదార్థాలను దాచి ఉంచినట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ బోటును గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారకా జిల్లాలోని ఓఖా ప్రాంతానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.