ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటిపన్నును ఆన్ లైన్ లోనే వసూలు చేయాలని నిర్ణయించింది. గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగానికి అవకాశం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా మొదట 15 జిల్లాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ వంతున 15 గ్రామ పంచాయతీల్లో ఇంటిపన్నును ఆన్ లైన్ లో వసూలు చేయనున్నారు. పన్ను వసూలుకు పంచాయతీ సిబ్బంది పాయింట్ ఆఫ్ సేల్ డివైసెస్ (పీవోఎస్ మిషన్లు) ను ఉపయోగిస్తారు. ఇంటి యజమానులు పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటితో పాటు డెబిట్, క్రెడిట్ కార్డులతో పన్ను చెల్లించవచ్చు.