దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరభారతదేశాన్ని చలి వణికిస్తున్నది. తీవ్రమైన చలిగాలులు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో రెండు రోజులు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా 15.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తగ్గి, 5 డిగ్రీలుగా నమోదయ్యాయి. రోడ్లపై పొగమంచు కప్పేయటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.