యూపీలోని లక్నోకు చెందిన ప్రియాంక శర్మ అనే మహిళ ఆ రాష్ట్రంలో తొలి మహిళా ప్రభుత్వ బస్ డ్రైవర్ గా రికార్డు సృష్టించారు. యూపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఇటీవల 26 మంది మహిళా డ్రైవర్లను నియమించారు. ప్రియాంక శర్మ కష్టపడి ఉద్యోగం సాధించారు. ప్రియాంక భర్త మద్యానికి బానిసై, అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో కుటుంబ భారం ఆమెపై పడింది.
ప్రియాంకకు ఇద్దరు పిల్లలున్నారు. ప్రియాంక మొదట ఓ ప్రైవేటు ట్రాన్స్ పోర్టులో హెల్పర్ గా చేరారు. అక్కడ బస్ డ్రైవింగ్ నేర్చుకుని, డ్రైవర్ గా పనిచేశారు. 2020లో ప్రభుత్వం మహిళా డ్రైవర్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా, ప్రియాంక దరఖాస్తు చేసుకొని సెలెక్ట్ అయ్యారు. 2022 మేలో శిక్షణ పొంది, సెప్టెంబర్ లో పోస్టింగ్ పొందారు. భర్తను కోల్పోయిన ఆమె ఇప్పుడు ఆర్టీసీలో ఉద్యోగం సాధించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.