వాట్సాప్ లో త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లతో పాటు డెస్క్‌టాప్ వెర్షన్ లో కూడా కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఆ ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* వాట్సాప్ లో త్వరలో 'అన్డూ' ఫీచర్ రానుంది. ఈ ఫీచర్ తో మీరు డిలీట్ ఫర్ మీ ద్వారా డిలీట్ చేసిన మెసేజ్ లను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు.
* ఆండ్రాయిడ్ యూజర్లు మరో డివైజ్‌లో తమ వాట్సాప్ లాగిన్ చేయాలంటే 6 డిజిట్ల కోడ్ ను ఎంటర్ చేయాలనే నిబంధన తప్పనిసరి కానుంది. మరో డివైజ్‌లో లాగిన్ అయ్యేటప్పుడు మీ నెంబర్ కు కోడ్ వస్తుంది.
* వాట్సాప్ స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్ ను ప్రతీసారి మార్చుకోవడం అవసరం లేకుండా వాట్సాప్‌లో ముందుగానే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఫీస్ అంటూ లిస్ట్‌లు రెడీ చేసుకునే ఫీచర్ రానుంది. మీరు ఏ లిస్ట్ ను ఎంపిక చేసుకుంటే వారికే ఆ స్టేటస్ కనిపిస్తుంది.
* ప్రస్తుతం వాట్సాప్ లో మనం బ్లాక్ చేసిన వారు మన ప్రొఫైల్ ఫొటోలు, స్టేటస్ అప్డేట్లను చూడలేరు. అయితే కొత్తగా వచ్చే వైట్‌లిస్ట్ ఫీచర్ తో వైట్‌లిస్ట్ జాబితాలో ఉన్న కాంటాక్టులు మాత్రమే స్టేటస్ అప్డేట్లు, డీపీలు చూసే అవకాశం ఉంటుంది.