చాలా మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఏదైనా ఆలోచనలో ఉన్నా, ఖాళీగా ఉన్నా, టెన్షన్‌గా ఉన్నా తెలియకుండానే గోళ్లు నోటి దగ్గరకు వెళ్లిపోతాయి. ఈ అలవాటు చిన్నప్పటి నుంచీ మొదలై పెద్దయ్యే దాకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ అలవాటు వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని, వెంటనే మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న చిట్కాలు పాటించి ఈ అలవాటును మానుకోవచ్చు. మీరు ఎప్పుడు గోళ్లు కొరుకుతున్నారా అనే విషయాన్ని గమనించండి. ఆ సమయంలో.. గోళ్ల మీద మీ దృష్టిని వేరే వాటిపై పెట్టండి. స్ట్రెస్ లో ఉన్నప్పుడు గోళ్లు కొరుకుతూ ఉంటారు. స్ట్రెస్ బాల్ వాడుతూ ఈ అలవాటు నుంచి బయట పడవచ్చు. కాల్షియం లోపం కూడా గోళ్లు కొరకడానికి కారణమవచ్చు. కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి.