తమిళనాడులోని నీలగిరి జిల్లా ఓల్డ్ ఊటీకి చెందిన జైశంకర్ (36) పెయింటర్‌గా పనిచేసేవాడు. భార్యతో మనస్పర్ధలు తలెత్తడంతో కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో జైశంకర్‌కు మరో వివాహిత రాధతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారటంతో పెళ్లి కూడా చేసుకున్నారట. రాధతో కొన్నాళ్లు మేట్టుపాళయంలో ఉన్న జైశంకర్ ఈమధ్యే ఊటిలోకి ఇంటికి వెళ్లాడు. అయితే తన మాజీ భార్యతో ఉంటున్న కుమారులు ఇద్దరూ మాట్లాడక పోవటంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఊటీ బొటానికల్ గార్డెన్‌ను చూడటానికి అని వెళ్లిన రాధ, జైశంకర్ అక్కడే విషం తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.