కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు రైవస్ కాలువలో దూకిన ఘనటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా,కంకిపాడుపరిధిలోని ఈడుపుగల్లుకు చెందిన నల్లమోతు రాజాబాబు (21) కుటుంబ కలహా ల వల్ల మనస్తాపానికి గురయ్యా డు. ఆదివారం రాత్రి ఉప్పలూరు పరిధిలోని రైవస్ కాలువలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. యువకుడు గల్లంతు అయిన సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు హుటాహుటిన రైవస్ కాలువలో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై దుర్గారావు చెప్పారు.