ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వణికిస్తుంది. భారత్‌లోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధి సోకిన రోగులకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. బీఎఫ్.7 వేరియంట్ సోకిన బాధితుల కోసం ప్రత్యేకంగా రెండు ఆస్పత్రులు కేటాయించినట్లు రెవెన్యూ మంత్రి ఆశోక తెలిపారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, మంగళూరులోని వెన్‌లాక్ హాస్పిటల్‌లో బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స అందించనున్నట్లు చెప్పారు.