నర్సీపట్నం వస్తున్న సీఎం జగన్మోహనరెడ్డికి నియోజకవర్గంలోని సమస్యలపై వినతిపత్రం అందజేస్తామని జనసేన పార్టీ కన్వీనర్ రాజాన వీర సూర్యచంద్ర పేర్కొన్నారు. సోమవారం ఆయన నర్శీపట్నంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాలేదన్నారు. దీంతో తామే నియోజకవర్గ సమస్యలను సీఎంకు వివరిస్తామని చెప్పారు. ముఖ్యంగా రహదారుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో మౌలిక వసతి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విషయాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.