బాపట్ల పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల విభిన్న ప్రతిభావంతుల అనుబంధ విభాగం అధ్యక్షులు బాపట్లలోని టీడీపీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విభిన్న ప్రతిభావంతుల విభాగం అధ్యక్షులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిబంధనల పేరుతో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లు నిలిపివేయటం దారుణమని, గత కొన్ని సంవత్సరాలుగా లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.