జమ్ముకశ్మీర్ లోని సిధ్రాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుబెట్టారు. సంజ్ తీర్థి-సిధ్రా రహదారిపై వెళ్తున్న ట్రక్కులో ఉగ్రవాదులు దాక్కున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలను రంగంలోకి దిగాయి. ట్రక్కును అడ్డుకొని తనిఖీలు చేస్తుండగా డ్రైవర్ పారిపోయాడు. అందులో దాక్కున్న ఉగ్రవాదులపై సిబ్బంది కాల్పులు జరిపి హతమార్చారు.