ఈ-స్పోర్ట్స్ కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారిక గుర్తింపు ఇచ్చింది. దీంతో పాటు ఇది దేశంలోని ప్రధాన క్రీడా విభాగాల్లో కూడా చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 77లో ఇచ్చిన అధికారాలు ఉపయోగించి రాష్ట్రపతి ఈ-స్పోర్ట్స్ నియమాల్లో మార్పులు చేశారు. జకార్తా ఆసియా క్రీడలు-2018లో ఈ స్పోర్ట్స్ ఓ ప్రదర్శన క్రీడగా చేర్చారు. అప్పటి నుంచి మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో దీన్ని భాగం చేయాలనే డిమాండ్ ఉంది. ఆన్ లైన్ గేమింగ్ సంబంధిత సమస్యలపై ఐటీ మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది చైనాలో జరగనున్న ఆసియా క్రీడల్లో ఈ-స్పోర్ట్స్ కూడా అరంగేట్రం చేయనుంది.