మొక్కలు నాటడం దేశ భవిష్యత్తుకు ఉపయోగకరమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యోగాంజనేయులు అన్నారు. మంగళవారం వేంపల్లి పట్టణంలోని తల్లి శెట్టి ప్రభుత్వ బాలికల పాఠశాలలో డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనియన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రమణారెడ్డి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఓబుల్ రెడ్డి, డాక్టర్ మల్లేశ్వరమ్మ, ఎన్ఎస్ఎస్ వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.