మన దేశంలో హిందీ ఎక్కువగా మాట్లాడుతారు కానీ వందలాది బాషలు వాడుకలో ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు, జాతులకు ఒక్కో భాష ఉంటుంది. అయితే, ప్రపంచంలో అత్యధిక భాషలు వాడుకలో ఉన్న టాప్-10 దేశాల జాబితాను వరల్డ్ ఇండెక్స్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ 456 వాడుక భాషలతో నాలుగవ స్థానంలో నిలిచింది. కాగా, 840 వాడుక భాషలతో పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూగినియా మొదటి స్థానంలో నిలిచింది. 715 భాషలతో ఇండోనేషియా రెండో స్థానంలో, 527 వాడుక భాషలతో నైజీరియా మూడవ స్థానంలో, 337 భాషలతో అమెరికా 5వ స్థానంలో నిలిచాయి.