ప్రియురాలితో గోవా టూర్ కోసం ఓ యువకుడు సొంతింట్లోనే చోరీకి పాల్పడ్డాడు. బెంగుళూరు ఆడుగోడి మహాలింగేశ్వరబండె ఏరియాలో సోదరుడి సల్మాన్ తో కలిసి మహమ్మద్ ఇర్ఫాన్ ఉంటున్నాడు. ఇటీవల ఇర్ఫాన్ ఓ యువతిని ప్రేమించగా ఆమె గోవా టూర్ కు తీసుకెళ్లాలని కోరింది. సరేనన్న ఇర్ఫాన్ డబ్బు కోసం ఇంట్లోని బీరువాలో ఉన్న 103 గ్రాముల బంగారు నగలతో ఉడాయించాడు. దీనిపై సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గోవాకు వెళ్లి షికార్లు చేస్తున్న ఇర్ఫాన్ ను అరెస్ట్ చేసి అతడి వద్ద బంగారం, కొంత డబ్బు స్వాధీనం చేసుకున్నారు.