కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చెన్నైలో జరిగింది. పరమత్తివేలూరు తాలూకు నెట్టైయం పాళయానికి చెందిన వీరప్పన్ కూలి. ఇతనికి భార్య భానుమతి, కూతురు నివేద ఉన్నారు. కాగా నివేద అదే ప్రాంతంలోని బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే యువరాజ్ ను ప్రేమించింది. వారు నెలరోజుల క్రితం ఇంటినుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకొని మకుడంచావడిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వీరప్పన్ తన కుమార్తెను ఇంటికి రావాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో సోమవారం కుమార్తెను తీసుకురమ్మని భార్యను పంపాడు. అయితే కూతురు ఇంటికి రావడానికి నిరాకరించిందని, తిరిగి వస్తున్నానని భర్తకు తెలిపింది. ఇంటికి వచ్చి చూసేసరికి భర్త తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.