బిడ్డలు మధుమేహం బారిన పడడంతో మనస్తాపంతో తల్లిదండ్రులు కుటుంబంతో సహా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులో జరిగింది. సేలంలో యువరాజ్, పాన్ విళి దంపతులకు నితీశా (7), అక్షర (5) అనే కుమార్తెలున్నారు. నితీషా మూడేళ్ల క్రితం షుగర్ బారిన పడగా చికిత్స అందిస్తున్నారు. 3 రోజుల క్రితం అక్షర కూడా షుగర్ బారిన పడినట్లు నిర్ధారణైంది. దీంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురై ఈరోడ్ జిల్లా పాలారు నదిలో పిల్లలతో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు మంగళవారం మృతదేహాలు వెలికితీశారు. అంతకు ముందు మృతులు సోదరులకు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.