ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యపై అనుమానంతో కొడుకును చంపేశాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 28, 2022, 12:32 PM

భార్యపై అనుమానంతో కన్న కొడుకును దారుణంగా హత్యచేసిన దారుణ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. మడకశిర మండలం శివపురం గ్రామానికి చెందిన కవిత, గంగరాజు భార్యభర్తలు. వీరికి ఒకటిన్నర సంవత్సరం వయసున్న వికాస్ అనే కుమారుడు ఉన్నాడు. గంగరాజు భార్యపై అనుమానం పెంచుకొని ఈ మధ్య తరచుగా గొడవ పడుతున్నాడు. ఈనెల 20న భార్యతో గొడవపడి కుమారుడ్ని తీసుకొని ఇంటి నుండి వెళ్లిపోయాడు. దీంతో కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. గంగరాజు తన అన్నకు కనిపించడంతో వికాస్ గురించి అడగగా ఎప్పుడో చంపేసినట్లు చెప్పాడు. దీంతో అతను కవితకు సమాచారమివ్వడంతో కవిత పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు గంగరాజును అరెస్టు చేసి విచారించగా ఉలవలకుంట గుట్ట వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిపాడు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా చిన్నారి మృతదేహం లభ్యమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com