ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు అలుముకున్న వేళ టీకాలపై ప్రభుత్వం మళ్లీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా తీసుకునే ‘నాజల్’ టీకా ‘ఇన్ కోవ్యాక్’ జనవరి 4 నుంచి కొవిన్ యాప్ ద్వారా అందుబాటులోకి రానుంది. సింగిల్ డోస్ అయిన దీన్ని ప్రభుత్వాసుపత్రులు, ఆరోగ్య, టీకా కేంద్రాల్లోనూ వేయించుకోవచ్చు. దీని ధర రూ.325గా నిర్ణయించారు. కాగా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ టీకా ధర రూ.800గా నిర్ణయించగా.. జీఎస్టీ ఇతర ఛార్జీలు కలుపుకొని రూ.1000 అవుతుంది.