భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలమవుతోంది. జోరు వానకు వరదలు తోడు కావడంతో ఇప్పటివరకూ 13 మంది మరణించగా.. 23 మంది గల్లంతయ్యారు. 45 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. దీంతో అధికారులు వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నదులు ఉప్పొంగి రోడ్లు కొట్టుకుపోయి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.