ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యంతో సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేరారు. ఆమెను చూసేందుకు మోదీ ఇవాళ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో హీరాబెన్ తన 100వ దశకు చేరుకుంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని యుఎన్ మెహతా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీ సహా ప్రముఖ రాజకీయ నేతలు హీరాబెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.