ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లిపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 28, 2022, 04:45 PM

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజు ఢిల్లీలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పెళ్లిపై ఒకరు ప్రశ్నించగా.. ఆయన ఎప్పటిలానే నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. నానమ్మ ఇందిరా గాంధీ, అమ్మ సోనియా గాంధీల లక్షణాలున్న అమ్మాయిని ఇష్టపడతానని తన మనసులో మాట వెల్లడించారు. ఇందిరాగాంధీ అంటే తనకు ప్రాణమని, తనకు రెండో తల్లిలాంటిదన్నారు. ఈ క్రమంలో మీ నానమ్మ లక్షణాలున్న మహిళను వివాహం చేసుకోవాలనుకుంటున్నారా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. అమ్మ, నానమ్మ ఇద్దరి లక్షణాలున్న అమ్మాయిని ఇష్టపడతానని రాహుల్ చెప్పి మంచి ప్రశ్న వేశావంటూ రిపోర్టర్ ను ప్రశంసించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com