తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. భారీగా తరలిరావడంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలు రోడ్డుపక్కన ఉన్న గుండం కట్ల అవుట్లెట్ కాలువలో పడిపోయారు. వారిలో కొందరు స్పృహ కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన కార్యకర్తలను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని, వారిని కాపాడాలని తాను ఎప్పుడూ కోరుకుంటున్నట్లు తెలిపారు.