ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మారెడ్డి దంపతులను పరామర్శించిన వైయస్ విజయమ్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 28, 2022, 09:37 PM

టీటీడీ ఈవో ధర్మారెడ్డి దంపతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి వైయస్ విజయమ్మ పరామర్శించారు. ఇదిలా ఉంటే ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ధర్మారెడ్డి దంపతులను వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ధర్మారెడ్డి స్వగ్రామమైన పారుమంచాలకు వెళ్లిన విజయమ్మ చంద్రమౌళి చిత్రపటం వద్ద పూలు వేసిన నివాళి అర్పించారు. 


అనంతరం ధర్మారెడ్డి దంపతులను ఓదార్చారు. అధైర్యపడొద్దని, తామంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. చంద్రమౌళికి టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి కుమార్తెతో వచ్చే నెల వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలను పంచుతున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ఇంతకు ముందే ఆయనకు నివాళి అర్పించి, ధర్మారెడ్డి దంపతులను పరామర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com