కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం బుధవారంతో 86వ రోజుకు చేరుకున్నది. బుధవారం ఎమ్మెల్యే బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రజా సంక్షేమ పథక వివరాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.