ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం

business |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 11:15 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతల నేపథ్యంలో గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 245 పాయింట్ల నష్టంతో 60,664 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 18,054 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.75 వద్ద ట్రేడవుతోంది. సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌,HUL, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, HDFC షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com