ప్రపంచ దేశాల్లో కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో భారత్‌లోనూ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల్లో విదేశాల నుంచి భారత్ వచ్చిన 6 వేల మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 39 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి వచ్చేవారిని ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉంటేనే భారత్‌లోకి అనుమతించాలని అధికారులను ఆదేశించింది.