ప్రియుడి మోజులో భర్తను భార్య చంపించిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం ఆల్వాలకు చెందిన ఆమోస్, అరుణ ఏడేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి అఖిల్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కర్నూలులోని సిటీ స్కైర్ మాల్ లో ఆమోస్ సెక్యూరిటీ గార్డుగా, అరుణ సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్నారు. ఇటీవల మద్యానికి బానిసైన ఆమోస్ భార్యను వేధిస్తున్నాడు. కాగా అరుణకు ఇంటి సమీపంలో ఉండే సూర్యప్రతాప్ తో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. తన భర్తను చంపేస్తే పెళ్లిచేసుకుంటానని అరుణ ప్రియుడితో చెప్పింది. దీంతో సూర్యప్రతాప్ తన స్నేహితుడు జీవన్ కుమార్ తో కలిసి ఆమోస్ ను తీసుకొని హంద్రీనది ఒడ్డుకు తీసుకెళ్లారు. అతనికి మద్యం తాగించి రాడ్డుతో బలంగా కొట్టి చంపేశారు. అనంతరం శవాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారు. 24న శవం బయటపడటంతో పోలీసులు అరుణను విచారించగా అసలు విషయం బయటపడింది.