కోల్‌కతాకు చెందిన ఆసిఫ్ అనే యువకుడు, జాతీయ రహదారి నిర్మాణ పనులు చేసేందుకు కర్ణాటకకు వచ్చాడు. ఈక్రమంలో అతడిని పాము కాటు వేసింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లమని స్థానికులు సూచించారు. కానీ అతడు మాత్రం తనను కాటేసిన పామును చేతిలో పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. చేతిలో పాము ఉండడం చూసి ఆస్పత్రి సిబ్బంది షాక్‌కు గురయ్యారు. అనంతరం ఆసిఫ్‌కు చికిత్స అందించారు. ఏ పాము కరిచిందో చూపించడానికి అలా తీసుకెళ్లాడని స్థానికులు చెబుతున్నారు.