జి. మాడుగుల మండలంలోని గురువారం విషాదం చోటుచేసుకుంది. మండలంలో ఉరుము గ్రామంలో శ్వాస అందాక మూడు నెలల చిన్నారి తుది శ్వాస విడిచింది. గుల్లి. సత్యరావు గుండమ్మ దంపతులకు ఇటీవల చిన్నారి జన్మించింది. చిన్నారి సోమవారం ఒక్కసారిగా అస్వస్థకు గురవడంతో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా సిరప్ ఇచ్చి పంపించేసారని తెలిపారు. సరైన వైద్యం చేసి ఉంటే తమ చిన్నారి బతికేదని డాక్టర్ల నిర్లక్ష్యం వలనే చనిపోయిందని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.