జైలులో వివిధ పనులు చేసే ఖైదీలకు చెల్లించే జీతాలను కర్ణాటక ప్రభుత్వం మరోసారిపెంచింది. వివిధ నేరాలు చేసి జైలుకు వచ్చిన ఖైదీలు వాళ్లు చేసే పనులకు రోజుకు రూ.524 అందుకుంటారు. రెండో ఏడాది రోజుకు రూ.548 చొప్పున నెలకు రూ.14,248, మూడో ఏడాది రోజుకు రూ.615 చొప్పున నెలకు రూ.15,990, నాలుగో ఏడాది నుంచి రోజుకు రూ.663 చొప్పున నెలకు రూ.17,238 అధికారులు ఖైదీలకు చెల్లిస్తారు. కాగా కర్ణాటక వ్యాప్తంగా ఉన్న మొత్తం 54 జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంఖ్య 3,565. వీరందరికీ ఏటా చెల్లిస్తున్న వేతనాల మొత్తం రూ.58,28,34,720. ఇప్పుడు ఈ మొత్తాన్ని మూడు రెట్లు పెంచడంతో దేశంలోని మిగతా జైళ్లతో పోలిస్తే కర్ణాటక జైళ్లలోని ఖైదీలు అత్యధిక వేతనం పొందుతున్నారు.