పెళ్లయి ఆరేళ్లు ఆరేళ్లు అవుతున్నా భర్త దగ్గరకు రానివ్వడం లేదంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త స్వలింగ సంపర్కుడని, ఈ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది. ఆయనకు పురుషులతో శారీరక సంబంధాలు ఉన్నాయని, తనను శరీరంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది. అయితే వాదనలు విన్న మెజిస్ట్రేట్ కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేశాడు భర్త. ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. గే అని దాచినందుకు ఆమెకు రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని, అలాగే ప్రతి నెల రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది.