చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మం పొడిబారిపోవడమే కాకుండా పగుళ్లు ఏర్పడి చికాకు కలుగుతుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఇలాంటి చర్మసమస్యల నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు. చలికాలంలో చాలామంది నీళ్లు ఎక్కువగా తాగరు. దీంతో బాడీ డీృ-హైడ్రేట్ అవుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగండి. చర్మం పొడిబారితే ఆల్కహాల్ కలిగిన బాడీ క్రీములు, లోషన్లువాడకండి. అవి చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. ఆల్కహాల్ తక్కువ శాతం ఉండే లోషన్లు వాడండి. నీటిలో కాస్త కొబ్బరినూనె వేసుకొని స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.