జగనన్న ఇళ్ల నిర్మానానికి ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇవ్వాలని, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనపర్చాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 22వ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జీ ఈశ్వరయ్య తెలిపారు. ఒంగోలు, మల్లయ్యలింగం భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ.... విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జనవరి 23 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజా స్వా మిక హక్కుల పరిరక్షణ కోసం సంఘటిత పోరాటానికి నడంకట్టాలని సీపీఐ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మో దీ పాలనలో మైనార్టీలు, దళితులు, గిరిజను లు అభద్రతాభవంతో జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. మతోన్మాద కార్పొరేట్ అనుకూల వైఖరిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు. ఈ విధానాలను వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీఉ మూ డేళ్లు గడిచినా నేరవేర్చలేదన్నారు. సెంటు స్థలం మాత్రమే కేటాయించి పైగా ఇళ్లను పేద లబ్ధిదారులు నిర్మించుకోవాలని, మాటమార్చారని ఒక్కో ఇంటికి రూ.150 లక్షలు మాత్రమే ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో ముఖ్యమంత్రికి తెలి యదా అని ప్రశ్నించారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశా రు. అప్పులు చేయ డంపై పెట్టిన దృష్టి అభి వృద్ధిపై లేదన్నారు. టిట్కో ఇళ్లను లబ్ధి దారుల కు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఈశ్వ రయ్య వెల్లడించారు. స మావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ. వెంకట్రావు, శ్రీనివాస్, పీవీఆర్ చౌదరి పాల్గొన్నారు.