శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కొండాపురం గ్రామ పంచాయతీ రాగిమేకలపల్లి గ్రామంలో శుక్రవారం గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.