అనకాపల్లి జిల్లాలో రూ.470 కోట్ల వ్యయంతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ ' స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి మనది. ఇలాంటి పరిస్థితుల్లో నేను, దాడిశెట్టి రాజా, ఉమాశంకర్, మరికొంతమంది ఎమ్మెల్యేలు కలిసి గతంలో జగన్ గారిని తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం గురించి విజ్ఞప్తి చేశాం. ఈ మహానుభావుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ కు శాల్యూట్' అని అన్నారు.