శిష్టకరణాలను ఓబీసీ జాబితాలో చేర్చడానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు జి. వి. ఎల్ నరసింహారావు హామీ ఇచ్చారు. 198 లో బి. పి. మండల్ కమిషన్ శిష్టకరణాలను ఓ. బి. సి. లో చేర్చాలని సిఫార్సు చేసిందని, ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశామని చెప్పారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. కార‍్యక్రమంలో సంఘం అధ్యక్షులు పోలుమహంతి ఉమామహేశ్వరరావు, ఓ. బి. సి కన్వీనర్ ఎం. సింహగిరి పట్నాయక్, కూరాడ పావని, ప్రేమకుమార్ ప్రభాకరదాసు, హరిబాబు, పి. వి. టి రమణరావు, పి. వి. ప్రసాదరావు, శివప్రసాద్, ఎస్. లక్ష్మణరావు, ఎం. సాలివాహన, కె. వి. రమణమూర్తి, డాక్టర్ శ్రీనివాస పట్నాయక్, పక్కి సీతారామస్వామి తదితరులు ఉన్నారు.