విశాఖజిల్లా గాజువాక నియోజక వర్గ పరిధిలోనిపెదగంట్యాడ ప్రాంతానికి చెందిన 11 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ముగ్గురు ముద్దాయిలకు ఒక్కొక్కరికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షను మహిళా న్యాయస్థానం విధించింది. దీంతోపాటు ఒక్కొక్కరూ పదివేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది.
ఇదేకాకుండా 2011లో జరిగిన ఈ ఘటనపై ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా నమోదైన కేసును డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎం. శైలజ న్యాయస్ధానంలో ముద్దాయిలకు శిక్షపడే వరకు శ్రమించారు. ముద్దాయిలు పెదగంట్యాడకు చెందిన మహమ్మద్ అమీర్, పుట్లూరు రాంజీ, మహమ్మద్ అష్రఫ్‌లు నేరాన్ని అంగీకరించడంతో వాదనలను పరిశీలించిన మహిళా న్యాయస్దానం సెషన్స్ జడ్జ్ మోకా సువర్ణ రాజు ఇవాళ తీర్పు వెలువరించారు. తీర్పు అనంతరం ముగ్గురు ముద్దాయిలను కేంద్ర కారాగారానికి తరలించారు.