ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 02:03 PM

ధనుర్మాసాన్ని పరిష్కరించుకొని శుక్రవారం గ్రామాలోని వేకువజాము నుండే దేవాలయ కేంద్రంగా హరినామ సంకీర్తనతో మేలుకొలుపులు ప్రారంభించి గ్రామం అంతా కూడా నామ సంకీర్తనతో మేల్కొల్పి దేవాలయ కేంద్రంగా ముగింపు కార్యక్రమం ప్రతిరోజు మండలంలో పలు గ్రామాల్లో సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ గ్రామ ధార్మిక జట్టు సహకారంతో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు నెలగంట మొదలుకొని భోగి వరకు నిర్వహించడం జరుగుతుందని సబ్ డివిజన్ ధర్మ ప్రచారకులు కొల్లి అప్పారావు తెలిపారు.


అచ్యుతాపురం మండలంలో హరిపాలెం, అందలాపల్లిలో వెలసిన శ్రీశ్రీశ్రీ వెంకటేస్వామివారి సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర సేవాసంఘం మరియు భగీరధ భజనమండలితో కలుపుకొని ధనుర్మాస ఉత్సవాలు సమరసతా సేవా ఫౌండేషన్ సబ్ డివిజన్ కన్వీనర్ బివి రమణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో బి వెంకునాయుడు, వెంకటరమణ, గాంధీ, మోహన్ రావు, రమణప్పారావు, కృష్ణ, భవాణి, కుమారి, దేవమ్మ, బుద్ద పారునాయుడు, వెంకటేశ్వర పంతులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com